రాజస్థాన్ రాజధాని జైపూర్లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.4గా నమోదైనట్లు నేషనల్ సిస్మాలజీ సెంటర్ తెలిపింది. 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని అధికారులు కనుగొన్నారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఉలిక్కిపడి బయటకు పరుగులు తీశారు.