సిఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియూ అనుబంధ ఏపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియూ జిల్లా కమిటీ సభ్యుడు దాసరి శ్రీనివాసులు, కార్యదర్శి కె. నరసయ్య మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు ప్రభుత్వం ద్రోహం చేసిందన్నారు.