రైతన్నలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం ఎరువులు సరఫరా చేసిందని విడపనకల్లు రైతు సేవా సహకార సంఘం చైర్మన్ బోయ శ్రీరాములు, సీఈవో ఏర్రిస్వామి పేర్కొన్నారు. గురువారం పాల్తూరు గ్రామంలో ఉన్న సొసైటీ ఎరువుల విక్రయ కేంద్రంలో జిల్లా కేంద్రం నుంచి వచ్చిన ఎరువులను నిల్వ చేశారు. ఎరువులు అవసరమైన రైతులందరూఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.