అచ్చుతాపురం మండలం పూడిమడక మత్స్యకారులకు చేపలతో పాటు పీతలూ భారీగా చిక్కాయి. చేపలవేటకు వెళ్లిన మత్స్యకారులు శనివారం పీతలతో ఆనందంగా తిరిగి వచ్చారు. అర కేజీ నుంచి కేజీన్నర వరకు బరువు ఉండే మండపీతలు లభించడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. వీటిని కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడానికి వ్యాపారులు సిద్ధం చేస్తున్నారు