ఇండోనేషియాలో కుక్కలు, పిల్లుల్ని తినడం సంప్రదాయంగా వస్తోంది. వీటితోపాటు గబ్బిలాలు, ఎలుకలు, పాములు, కోతులను కూడా తింటుంటారు. సులావేసి దీవిలోని టొమొహోన్ మార్కెట్‌లో విరివిగా జంతు మాంసాలు అమ్ముతుంటారు. మాంసం అమ్మకాలపై నిషేధాలు విధించాలని జంతు ప్రేమికులు ఆందోళన చేయడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుక్కలు, పిల్లుల మాంసం అమ్మకాలపై నిషేధం విధించింది. ఈ విషయాన్ని హ్యుమన్ సొసైటీ ఇంటర్నేషనల్ (హెచ్ఎస్ఐ) తెలిపింది.