అమెరికా ఒహియోలోని కొలంబస్ జూలో వింత ఘటన చోటు చేసుకుంది. సల్లీ అనే మగ గొరిల్లా తాజాగా ఓ ఆడ గొరిల్లాకు జన్మనిచ్చింది. ఈ విషయం స్థానికంగా వైరల్ అయింది. దీనిపై జూ అధికారులు ఈ విధంగా వివరణ ఇచ్చారు. గొరిల్లాలకు 8 ఏళ్లు వచ్చే వరకు ఆడ, మగ చెప్పడం కష్టంగా ఉంటుందని, 12 ఏళ్లు వచ్చాకే ఓ స్పష్టత వస్తుందన్నారు. సల్లీని మగ గొరిల్లాగానే భావించామని, ఇప్పుడు గొరిల్లాకు జన్మినివ్వడంతో అది ఆడ గొరిల్లాగానే భావిస్తున్నామని తెలిపారు.