ఉత్తరాఖండ్లో భూకంపం సంభవించింది. పిథోర్ఘర్లో ఈరోజు సాయంత్రం 6.34 గంటల ప్రాంతంలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. భూకంపం వచ్చిన వెంటనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప కేంద్రం భూమికి 5 కిలోమీటర్ల దూరంలో సంభవించినట్లు జాతీయ భూకంప శాస్త్ర అధికారులు తెలిపారు.