తన కార్యాలయం నుంచే వీడియో లింక్ ద్వారా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విగ్రహ నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన చేసే భాగ్యం దక్కడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అమిత్ షా పేర్కొన్నారు. కాగా, ఈ భారీ శ్రీరాముడి విగ్రహాన్ని మంత్రాలయం శివారు ప్రాంతంలో నిర్మిస్తున్నారు. ఈ పంచలోహ శ్రీరాముడి విగ్రహ నిర్మాణానికి సుమారు రూ.300 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణకర్త, ప్రముఖ శిల్పి రామ్ వాంజీ సుతార్ మంత్రాలయంలో శ్రీరాముడి విగ్రహ నిర్మాణంలో పాలుపంచుకోనున్నారు. కాగా, ఈ విగ్రహం ముందు భాగంలో 10 ఎకరాల విస్తీర్ణంలో రామాలయం ఉండేలా నిర్మాణ ప్రణాళిక రూపొందించారు.