ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ కొత్త పార్టీని ప్రకటించనున్నారు.ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో ఏపీ ప్రజా సింహగర్జన పేరుతో రామచంద్ర భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.భారత్ చైతన్య యువజన పేరుతో పార్టీని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పార్టీ పేరు కేంద్ర ఎన్నికల సంఘం జాబితాలో నమోదు కాలేదని తెలుస్తోంది.