ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌లో పాకిస్థాన్-A ఛాంపియన్‌గా నిలిచింది. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో టీమిండియాపై పాకిస్థాన్ విజయం సాధించింది. 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్-ఎ జట్టు 224 పరుగులకే ఆలౌటైంది. అభిషేక్ శర్మ 61, కెప్టెన్ దుల్ 39 మినహా ఎవరూ రాణించలేకపోయారు. వరుస విరామాల్లో వికెట్లు పడడంతో టీమ్ ఇండియా కోలుకోలేకపోయింది. ఫలితంగా పాకిస్థాన్ చేతిలో 128 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa