ఏపీలో రేషన్ కార్డులున్న వారికి పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు శుభవార్త అందించారు. ఆగస్టు నుంచి రేషన్ షాపుల ద్వారా కందిపప్పు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రేషన్ డీలర్ల కోసం గ్రామాల్లో గోదాములు, దుకాణాలు నిర్మిస్తామని, సీఎంతో మాట్లాడి రేషన్ డీలర్ల కమీషన్ పెంచుతామని స్పష్టం చేశారు. డీలర్లకు ఆరోగ్యశ్రీ, ఎల్ఓసీ ఇచ్చేలా కృషి చేస్తామన్నారు.