వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేడు అల్పపీడనంగా. బుధవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి.