ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ నియమితులయ్యారు. ఈ నెల 5న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ దానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ట్విట్టర్లో వెల్లడించారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.