బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. ఇది మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని వల్ల ఏపీలో మరో మూడు రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ విభాగం తెలిపింది. బుధవారం అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీగా, మిగిలిన చోట్ల ఓ మోస్తరుగా వర్షాలు పడే అవకాశం ఉంది.