ఏపీలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజులు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. MBBS ప్రస్తుత కన్వీనర్ కోటా ఫీజు రూ.15,000 ఉండగా రూ.16,500కు, B కేటగిరీ ఫీజు రూ.12,00,000 ఉండగా రూ.13,20,000కు పెంచింది. BDS కన్వీనర్ కోటా రూ.13,000 ఉండగా రూ.14,300కు, B కేటగిరీ ఫీజు రూ.4,00,000 ఉండగా రూ.4,40,000కు పెంచింది. 2023-24 నుంచి 2025-26 వరకు పెంచిన ఫీజులు అమల్లో ఉంటాయని పేర్కొంది.