కేంద్రం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్ష కూటమి 'ఇండియా' సిద్ధమైంది. లోక్సభలో కాంగ్రెస్ డిప్యూటీ నేత గౌరవ్ గొగొయ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు స్పీకర్ కార్యాలయానికి నోటీసులిచ్చినట్లు కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ వెల్లడించారు. మరోవైపు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు సైతం నోటీసులు ఇచ్చారు.