విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం మంగళవారం కౌన్సిల్ హాల్లో వాడి వేడిగా సాగింది. జీవీఎంసీ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై టీడీపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు, బీజేపీ సభ్యులు ధ్వజమెత్తాయి. మేయర్ వెంకటకుమారి అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో తొలుత జీర్ అవర్ అనుమతించాలన్నారు. ఎమ్మెల్సీ వంశీ కృష్ణ, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, గణబాబు నగరాభివృద్ధిపై దృష్టిసారించాలని సూచించారు.