మునగపాక గ్రామానికి చెందిన దొడ్డి రామకృష్ణకు గుండె ఆపరేషన్ చేయవలసి వచ్చింది. నిరుపేద అయిన రామకృష్ణకు లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి గుండె ఆపరేషన్ చేసుకునే అవకాశం లేకపోవడంతో దాతలు విరాళం కోరాడు. దీంతో అనేకమంది స్పందించి రామకృష్ణకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం నాగులపల్లి గ్రామానికి చెందిన కాండ్రేగుల చందు మునగపాక గ్రామానికి చెందిన పి. విజయ్ చెరొక రూ. 10000 ఆర్థిక సహాయం చేశారు