పేదవాడి ఇంటికే ప్రభుత్వ సేవలు అందించే విధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం జగనన్న సురక్ష పథకమని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగా నాగార్జున అన్నారు. మంగళవారం చుండూరు మండల పరిధిలోని తొట్టింపూడి గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్లు, సుబ్బారెడ్డి, అప్పిరెడ్డి, ఎం. పి. పి, జాలాది రూబేను, తదితరులు పాల్గొన్నారు.