కార్గిల్ దివస్ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ వీర జవాన్లకు నివాళులర్పించారు. భారత గౌరవ ప్రతిష్ఠలను కాపాడుకోవడానికి నియంత్రణ రేఖను దాటడానికి సిద్ధంగా ఉందని.. ప్రజలు కూడా సైన్యానికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘పాకిస్థాన్ మనకు వెన్నుపోటు పొడిచింది. భారత్ యుద్ధం చేయాల్సి వచ్చింది. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన సైనికులకు వందనం చేస్తున్నా’ అని పేర్కొన్నారు.