ప్రతిపక్ష కూటమి 'ఇండియా' కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ అనుమతించారు. అన్ని పార్టీలతో మాట్లాడి చర్చకు సమయం ప్రకటిస్తామని వెల్లడించారు. కాగా, నేడు ఉదయం లోక్‌సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు స్పీకర్‌కు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే.