రీడెవలప్ చేసిన ఢిల్లీ ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ITPO) కాంప్లెక్స్‌ను ఇవాళ సాయంత్రం ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఉదయం వేదిక ప్రాంగణంలో పూజలు నిర్వహించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే జీ20 సమావేశాలకు ఈ ప్రాంగణం వేదిక కానుంది. సుమారు 123 ఎకరాల క్యాంపస్ విస్తీర్ణంలో ఉన్న ప్రగతి మైదాన్ కాంప్లెక్స్‌ను రూ.2,700 కోట్లతో అభివృద్ధి చేశారు.