మాజీ క్రికెటర్ యువరాజ్ కుటుంబంపై ఓ మహిళ బెదిరింపులకు పాల్పడింది. తనకు రూ.40 లక్షలు ఇవ్వాలని లేకుంటే తప్పుడు కేసుల్లో ఇరికిస్తానంటూ యువరాజ్ తల్లిని ఫోన్‌లో బ్లాక్ మెయిల్ చేసింది. దీంతో యూవీ ఫ్యామిలీ పోలీసులను ఆశ్రయించడంతో ఆమె ఆట కట్టింది. ఆమెను గతంలో యువీ కుటుంబం వద్ద పని చేసిన మహిళగా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. యువరాజ్ సింగ్ సోదరుడు జోరవీర్ సింగ్ కొన్నేళ్లుగా ఆనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయనకు సహాయకురాలిగా గతేడాది హేమా కౌశిక్ అనే మహిళను యువీ తల్లి నియమించారు.
కానీ, హేమ తీరు, నడవడిక నచ్చకపోవడంతో 20 రోజుల్లోనే ఆమె పనిలో నుంచి తొలగించింది. తనను కొద్ది రోజుల్లోనే పనిలో నుంచి తీసేయడం తట్టుకోలేకపోయింది. దీంతో ఈ ఏడాది మే నుంచి యువీ తల్లికి వాట్సప్‌లో మెసేజ్‌లు, ఫోన్‌లు చేస్తూ బెదిరింపులకు దిగుతోంది. రూ. 40 లక్షలు ఇవ్వకపోతే తప్పుడు కేసులు పెట్టి కుటుంబం పరువు తీస్తానంటూ యువీ తల్లికి వాట్సాప్ మేసేజ్ చేసింది. దీనిపై యువరాజ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన గురుగ్రామ్ పోలీసులు ఆమెను ఆరెస్ట్ చేశారు. ఆమెను వలవేసి పట్టుకున్నారు.
యువరాజ్ సింగ్ తల్లి నుంచి రూ.5 లక్షలు తీసుకుంటుండగా గురుగ్రామ్ పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ (ఈస్ట్) నితీశ్ అగర్వాల్ మాట్లాడుతూ.. నిందితురాలిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్టు తెలిపారు. ఆమె ప్రశ్నిస్తున్నామని చెప్పారు. అయితే, దీనిపై యూవీ ఫ్యామిలీ మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు.
గురుగ్రామ్ డీఎల్ఎఫ్ ఫేజ్-Iలో యువరాజ్ ఇల్లు ఉంది. డిప్రెషన్‌లో ఉన్న జోరావర్ సింగ్‌కు చికిత్స అందజేస్తున్నారు. అతడు, కోలుకునే సమయంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా కేర్‌టేకర్‌గా హేమను ఉంచారు. అయితే, యువరాజ్ సోదరుడ్ని వలలో వేసుకోడానికి ఆమె ప్రయత్నించినట్టు తెలుస్తోంది. దీంతో 20 రోజుల తర్వాత హేమను పని నుంచి తొలగించారు.