తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి, అలసత్వానికి నిరసనగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి నిరసన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయంలోనే వంటావార్పు చేసి అక్కడే నిద్రించారు. ఉదయం తన ఛాంబర్ లో అల్పాహారం చేశారు. ప్రోటోకాల్, మున్సిపల్ నిబంధనలు పాటించకుండా ఆసుపత్రి ప్రారంభించడంపై అధికారులు సరైన సమాధానం చెప్పే వరకు నిరసన విరమించమని జెసి తెలిపారు.