మున్సిపల్ కమిషనర్ తీరును నిరసిస్తూ ఐదు రోజులుగా తాడిపత్రిలో టీడీపీ కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. వారితోపాటు చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి నిరసన కొనసాగిస్తున్నారు. టీడీపీ కౌన్సిలర్ల నిరసనను మున్సిపల్ కమిషనర్ పట్టించుకోకపోవడంతో టీడీపీ కౌన్సిలర్ల ఆందోళన కొనసాగుతూనే ఉంది. మున్సిపల్ కార్యాలయానికి కమిషనర్ వచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి తెలిపారు.