ఇండిగో ఎయిర్‌లైన్సులో పనిచేసే ఇద్దరు పైలెట్ల లైసెన్సులను విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ సస్పెండ్ చేసింది. జూన్ 15న అహ్మదాబాద్ విమానాశ్రయంలో విమానం కిందికి దిగే సమయంలో తోక భాగం నేలను తాకిన ఘటనలో వీరిద్దరిపై చర్యలు తీసుకున్నారు. ఇద్దరు పైలెట్లు షోకాజ్ నోటీసులకు సమాధానం ఇచ్చిన అనంతరం ఈ చర్యలు చేపట్టారు. పైలెట్ లైసెన్సును 3 నెలలు, కో పైలెట్ లైసెన్సును నెల రోజుల పాటు సస్పెండు చేశారు.