ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 14వ విడత నిధులు నేడు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. పీఎం కిసాన్ పథకం కింద సుమారు 8.5 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రధాని మోదీ ఇవాళ రాజస్థాన్‌లోని సికార్‌లో ఉదయం 11 గంటలకు అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నగదును జమచేయనున్నారు. కేంద్రం ఈ పథకం కింద రూ.6 వేలను ప్రతి ఏటా ఇస్తోంది. వీటిని మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమచేస్తోంది.