ఏపీలో మహిళల అదృశ్యానికి సంబంధించి జనసేనాని పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై విమర్శలు చేయడం తెలిసిందే. అయితే ఈ వివరాలను రాజ్యసభలో కేంద్ర హోంశాఖ తాజాగా వెల్లడించింది. ఏపీలో 2019 నుంచి 2021 వరకు మూడేళ్లలో 7,928 బాలికలు, 22,278 మహిళలు అదృశ్యమైనట్లు పేర్కొంది. 2019లో 2,186 బాలికలు, 6,252 మహిళలు, 2020లో 2,374 బాలికలు, 7,057 మహిళలు, 2021లో 3,358 బాలికలు, 8,969 మహిళలు అదృశ్యమైనట్లు కేసులు నమోదైనట్లు తెలిపింది.