ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. ఏపీకి సంబంధించిన పలు సమస్యలపై ఆమెకు వినతిపత్రం సమర్పించారు. సమావేశం అనంతరం పురందేశ్వరి ట్విట్టర్ ద్వారా స్పందించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిగిన సమావేశం ఫలప్రదంగా ముగిసిందన్నారు. పురందేశ్వరి మాట్లాడుతూ.. ‘ఏపీలోని వైసీపీ ప్రభుత్వం నిధుల మళ్లింపుపై నిర్మల దృష్టికి తీసుకెళ్లాను. ప్రభుత్వం విచక్షణా రహితంగా అప్పులు చేసి రాష్ట్రంపై, ప్రజలపై భారం మోపుతున్న విషయాన్ని ఆమెకు వివరించాను.నిర్మలా సీతారామన్ ను నేను కలిసిన ఉద్దేశం నెరవేరింది" అని పురందేశ్వరి పేర్కొన్నారు.