ప్రతిపక్ష పార్టీలు, వివిధ ప్రజా సంఘాల డిమాండ్లపై స్పందించిన మణిపూర్ ప్రభుత్వం గురువారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను ఈ నెలాఖరులో లేదా ఆగస్టు మొదటివారంలో నిర్వహించాలని నిర్ణయించింది. క్యాబినెట్ సమావేశం అనంతరం మణిపూర్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సపమ్ రంజన్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపాదిత అసెంబ్లీ సెషన్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.ప్రస్తుతం జరుగుతున్న జాతి హింస, సంబంధిత అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు తెలిపాయి.