పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం, కేసానుపల్లి గ్రామంలో ఆటో నగర్ ఏర్పాటుకు స్థానిక నేతలు, అలానే జిల్లా కలెక్టర్ సిద్దమయ్యారు అనే చెప్పొచ్చు. వివరాల్లోకి వెళ్ళితే.... కేసానుపల్లి గ్రామా పంచాయతీలో దాదాపుగా 19 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంలో స్థానిక నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ.... గత 20 సంవత్సరాల నుండి కలగా మిగిలిపోతున్న ఆటో నగర్ నేడు కార్య రూపు దాల్చుతుంది. నరసరావుపేట సిటీకి కూతవేటు దూరంలో గల కేసానుపల్లి గ్రామా పరిధిలో ఏర్పాటు చెయ్యడానికి కావలసిన అన్ని విషయాలు తదితర అధికారులతో మాట్లాడి ముందుకు వెళ్లేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో తగిన స్థలాన్ని పరిశీలించడం జరిగింది. సంభందిత వివరాలని త్వరలోనే తెలియజేస్తాం అని తెలియజేసారు. అలానే పెద్ద తురకపాలెం గ్రామా పరిధిలో కేంద్ర ప్రభుత్వం కింద నిర్మించబడుతున్నా గిరిజన బాలికల కళాశాల మరియు మైనారిటీ కళాశాలలను సందర్సించి, వాటికీ సంభందించి త్వరగా పనులు పూర్తి చెయ్యాలని అధికారులని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివశంకర్, స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మారూరి శివారెడ్డి, జడ్పీటీసీ చిట్టిబాబు తదుతరులు పాల్గొన్నారు.