ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ కేసులో టీడీపీ నాయకురాలు అనితకు హైకోర్టులో ఊరాట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 28, 2023, 07:36 PM

టీడీపీ ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన వంగలపూడి అనితకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. తనపై అసభ్యకరమైన పోస్టింగులు పెట్టారంటూ నందిగామకు చెందిన సజ్జనరావు అనే వ్యక్తి ఇంటి ముందు అనిత నేతృత్వంలో తెలుగు మహిళలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు.  ఈ కేసులపై అనిత హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో అనిత తరపున న్యాయవాది సతీశ్ వాదనలు వినిపించారు. వాదనలను విన్న తర్వాత హైకోర్టు పోలీసులకు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. అనితపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com