జులై 30 వరకు విమానాలను రద్దు చేస్తున్నట్టు గో ఫస్ట్ మరోసారి ప్రకటించింది. కార్యాచరణ కారణాల వల్ల తమ సేవలను నిలుపుదల చేస్తున్నట్టు కంపెనీ ట్వీట్ చేసింది. ఈ మేరకు ప్రయాణికులకు కంపెనీ క్షమాపణలు చెప్పింది. మే 3, 2023 నుంచి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున గో ఫస్ట్ తన అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు గతంలో ప్రకటించింది. ఇది ఇప్పటివరకు కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa