పేదలకు రేషన్ సరుకులు జూలై నెలలో అత్యధికంగా నరసరావుపేట మండలంలో 93. 35 శాతం మందికి అందజేసినట్లు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి ఎస్. పద్మశ్రీ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఆ తర్వాతి స్థానం చిలకలూరిపేట మండలానికి దక్కిందని, చిలకలూరిపేటలో 92. 13 శాతం మందికి రేషన్ సరుకులు పంపిణీ చేశామన్నారు.