ఈ నెల 31వ తేదీ సోమవారం నగరం మండలంలోని చిన్నమట్లపూడి గ్రామంలో కోటి రూపాయల వ్యయంతో చేపట్టనున్న విద్యుత్ ఆధునికరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని నగరం ఎంపీపీ చింతల శ్రీకృష్ణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ ముఖ్యఅతిథిగా పాల్గొంటారన్నారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ నాయకులు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.