ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్‌లో బాంబు పేలుడు,,,20 మంది దుర్మరణం, 50 మందికి గాయాలు

international |  Suryaa Desk  | Published : Sun, Jul 30, 2023, 10:13 PM

పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫఖ్తున్‌ఖ్వాలో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 30 మందికిపైగా గాయపడ్డారు. కాగా ఈ పేలుడులో 35 మంది వరకూ చనిపోయారని మీడియా కథనాలు ప్రసారం చేసింది. బజౌర్స్ కౌర్‌లోని జమియత్ ఉలేమా ఇ ఇస్లాం ఫజుల్‌ అనే రాజకీయ పార్టీ సమావేశంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. బాంబు పేలుడులో ఆ పార్టీకి చెందిన స్థానిక నేత కూడా చనిపోయారని సమాచారం. JUI భేటీకి 500 మంది వరకూ హాజరైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. భద్రతా సిబ్బంది ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు.


జమియత్ ఉలేమా ఇ ఇస్లాం అసలు పేరు జమియత్ ఉలేమా ఇ హింద్. 1919లో బ్రిటిష్ ఇండియాలో దీన్ని ఏర్పాటు చేశారు. షబ్బీర్ అహ్మద్ ఉస్మానీ మరణానంతరం ఆయన సన్నిహితుడైన జాఫర్ అహ్మద్ దీని బాధ్యతలు చేపట్టారు. 1962లో ముఫ్తీ మహ్మద్ ఈ పార్టీ అమీర్ అయ్యారు. 1980 వరకు ముఫ్తీ మహ్మదే ఆ బాధ్యతలను నిర్వర్తించారు. ముఫ్తీ మరణానంతరం పార్టీ ముక్కలైంది. ముహ్మద్ జియా ఉల్ హక్ కాలంలో పార్టీ పేరును జమియత్ ఉలేమా ఇ ఇస్లాంగా మార్చారు. 1953లో జరిగిన అహ్మదియ వ్యతిరేక అల్లర్లు, 1974లో చోటు చేసుకున్న షియా వ్యతిరేక ఘర్షణల్లో ఈ పార్టీ చురుకైన పాత్ర పోషించింది. పాకిస్థాన్‌లో స్వచ్ఛమైన ఇస్లాంను స్థాపించాలనేది.. జిహాద్‌‌కు మద్దతు పలికే ఈ పార్టీ ప్రధాన అజెండా.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa