పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు మానవాళి మనుగడుకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. భారీస్థాయిలో విడుదలవుతోన్న గ్రీన్ హౌస్ వాయువులు, కర్బన ఉద్గారాలు వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు అంటార్కిటికా లో మంచు ఫలకాలను శరవేగంగా కరిగించేస్తున్నాయి. తాజాగా, అంటార్కిటికా ఖండంలో ఓ భారీ హిమఫలకం కరిగిపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఆ ప్రాంతంలోని సముద్రంలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి మంచు పడిపోవడం కలవరపరిచే అంశం.
కాగా, ఏటా వేసవిలో మంచు కరిగి.. తిరిగి శీతాకాలంలో భారీ హిమఫలకాలు ఏర్పడటం అక్కడ సర్వసాధారణమే. కానీ, ఈ సారి మాత్రం అలా జరగలేదు. వేసవి ముగిసి శీతాకాలం వచ్చినా అనుకున్న స్థాయిలో మంచు ఏర్పడకపోవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి మంచు పడిపోయింది. గత ఏడాది శీతాకాలం (2022)తో పోల్చితే 16 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో మంచు తగ్గినట్లు నేషనల్ స్నో అండ్ ఐస్ డేటా సెంటర్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
1981-2010 మధ్య సగటు కంటే ఈ ఏడాది జులై మధ్యలో అంటార్కిటికాలో 26 లక్షల చదరపు కిలోమీటర్ల (మిలియన్ చదరపు మైళ్లు) మంచు తక్కువగా ఉంది. ఈ విస్తీర్ణం దాదాపు అర్జెంటీనా లేదా టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూమెక్సికో, ఆరిజోనా, నెవాడా, ఉటాహ్, కొలరాడాలో రాష్ట్రాల మొత్తం వైశాల్యాలకు సరిసమానం. దాదాపు 10 లక్షల సంవత్సరాల్లో ఒకసారి ఇలా జరుగుతుందని కొలారాడో బౌల్డర్ యూనివర్శిటికి చెందిన గ్లేసియాలజిస్ట్ టెడ్ స్కాంబోస్ పేర్కొన్నారు. ‘‘పరిస్థితి పూర్తిగా మారిపోయింది.. ఇవేమీ అంత మంచి పరిణామం కాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
అంటార్కిటిక్‌లో కొన్ని దశాబ్దాల్లోనే మంచు అత్యధిక స్థాయి నుంచి అత్యల్ప స్థాయికి చేరింది. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు శాస్త్రవేత్తలను కలవరానికి గురిచేస్తున్నాయి. 2016 నుంచి ఇక్కడ సముద్రంలో మంచు నిరంతరం కరుగుతున్నట్లు గుర్తించారు. ‘అంటార్కిటిక్‌లో పరిస్థితులు తరచూ మారుతుంటాయి. ప్రస్తుత మార్పు మాత్రం చాలా ఎక్కువగా ఉంది.. గత రెండేళ్లలో ఏదో పెనుమార్పు చోటు చేసుకుంది.. ఇది గత 45 ఏళ్ల కిందటి పరిస్థితిని తలపిస్తోంది’ అని గ్లేసియాలజిస్ట్ టెడ్ స్కాంబోస్ పేర్కొన్నారు.
అంటార్కిటికా చుట్టూ ఉన్న పశ్చిమ గాలుల తీవ్రతతో సహా అనేక అంశాలు సముద్రపు మంచు నష్టానికి దారితీస్తాయని స్కాంబోస్ చెప్పారు. భూ కాలుష్యం పెరుగుదలతో ముడిపడి ఉన్నాయని అన్నారు. ‘అంటార్కిటిక్ మహాసముద్రం సరిహద్దుకు ఉత్తరాన ఉన్న వెచ్చని సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణంగా ప్రపంచంలోని మిగిలిన మహాసముద్రాల నుంచి కొంతవరకు వేరుచేయబడిన నీటిలో కలపడం కూడా దీనిని నివారణకు ఓ ఆలోచనలో భాగం’ అని స్కాంబోస్ వ్యాఖ్యానించారు. అంటార్కిటిక్ సముద్రపు మంచు రికార్డులు ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో 691,000 చదరపు మైళ్ల వద్ద అత్యల్ప స్థాయికి చేరుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa