ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో మరో భారతీయుడు

international |  Suryaa Desk  | Published : Sun, Jul 30, 2023, 10:19 PM

వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా.. మరో ప్రవాసీ భారతీయుడు పోటీకి సిద్ధమయ్యారు. భారతీయ అమెరికన్ ఇంజినీర్‌ హర్ష్‌వర్దన్‌ సింగ్‌ 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు తన అభ్యర్థిత్వాన్ని ఫెడరల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ వద్ద హర్ష్‌వర్దన్ నమోదు చేసుకున్నారు. ఇప్పటికే ఇద్దరు భారతీయ అమెరికన్లు నిక్కీ హేలీ (51), వివేక్‌ రామస్వామి(37) ఎన్నికల్లో పోటీ చేయనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ముగ్గురూ ఒకే పార్టీకి చెందినవారే కావడం గమనార్హం.


రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీ పడునుండగా.. అదే పార్టీకి చెందిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. దీంతో అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో రిపబ్లికన్లలో తీవ్ర పోటీ నెలకుంది. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఎవరు ఉండాలో వచ్చే ఏడాది జులై 15 నుంచి 18 వరకూ విస్కోన్సిన్‌లో జరగబోయే రిపబ్లికన్ల జాతీయ సదస్సులో నిర్ణయించనున్నారు.


‘న్యూజెర్సీ రిపబ్లికన్ పార్టీ కన్జర్వేటివ్ విభాగం పునరుద్ధరణకు పనిచేసిన రిపబ్లికన్ వాది.. అమెరికా మొట్టమొదటి సంప్రదాయవాది.. గత కొన్ని సంవత్సరాలుగా సంభవించిన మార్పులను తిప్పికొట్టి, అమెరికన్ విలువలను పునరుద్ధరించడానికి మాకు బలమైన నాయకత్వం అవసరం.. అందుకే 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున నామినేషన్ వేయాలని నేను నిర్ణయించుకున్నాను’ అని హర్షవర్దన్ సింగ్ ట్విట్టర్‌లో మూడు నిమిషాల వీడియోను షేర్ చేశారు.


ఇక, సింగ్ తనను తాను ‘ఏకైక ప్యూర్‌బ్లడ్ అభ్యర్థి’గా అభివర్ణించుకున్నారు ఎందుకంటే తాను కోవిడ్ టీకాలకు లొంగలేదు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక, 2017, 2021లో న్యూజెర్సీ గవర్నర్‌గా రిపబ్లికన్ ప్రైమరీ.. 2018లో హౌస్ సీటు, 2020లో సెనేట్‌కు పోటీచేసినా రిపబ్లికన్ పార్టీ నామినేషన్‌ గెలుచుకోవడంలో విఫలమయ్యారు. గవర్నర్ పదవి కోసం జాక్ సియాట్రేల్లితోనూ పోటీపడినా మూడో స్థానంలో నిలిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa