ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకు పెట్టుబడి సాయంగా రూ.20 వేలు అందజేస్తామని తెలుగుదేశం అగ్రనేత నారా లోకేష్ తెలిపారు. యువగళం పాదయాత్రలో భాగంగా రైతులకు 90శాతం సబ్సిడీతో ఇన్ పుట్ సబ్సిడీ, డ్రిప్ పరికరాలు అందజేస్తామని అద్దంకి బహిరంగ సభలో తెలిపారు. అదేవిధంగా వ్యవసాయ సంబంధిత రంగాలకు మరింత ఊతమిచ్చి గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. .