ప్రముఖ పర్యాటక కేంద్రమైన లేపాక్షి ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడింది. ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు, భక్తులు విచ్చేశారు. జఠాయువు పక్షి, నంది విగ్రహం, దుర్గా, వీరభద్రస్వామి ఆలయం భక్తులతో సందడి నెలకొంది. ఆలయంలో ఆలయ అర్చకులు దుర్గా, వీరబద్రస్వాములను ప్రత్యేకంగా అలంకరించి అభిశేఖాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తాదులు తీర్థ ప్రసాదాలను అందుకున్నారు.