ముగ్గురు వ్యాపారులు రూ.21 లక్షల విలువైన 735 టమాటా బాక్సులను కొనుగోలు చేశారు. 15 కిలోల బరువున్న ఒక్కో టమాటా బాక్సును రూ.2 వేల నుంచి రూ.2,150కి తీసుకున్నారు. వాటిని ట్రక్కులో లోడ్ చేసి రాజస్థాన్ రాష్ట్రంలోని కోలార్ నుంచి జైపూర్‌కు తరలించారు. అయితే ట్రక్కు డ్రైవర్ టచ్‌లో లేకుండా పోయాడు. దాంతో ఆందోళన చెందిన వ్యాపారులు కోలార్ పోలీసులకు ఆశ్రయించారు. దీంతో ట్రక్కును, డ్రైవర్‌ను పట్టుకునేందుకు గాలిస్తున్నారు.