దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో భద్రతా పరమైన ఆధునికీక రణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎకెత్రిపాఠి తెలిపారు. ఈనెల31నుంచి ఆగస్టు6 వరకు కాకినాడ-విశాఖ పాసింజర్ రైలు విశాఖ (07466)రాజమహేంద్రవరం (07467) ప్రత్యేక పాసింజర్ రైలు, విశాఖ-విజయవాడ (22701), విజయవాడ-విశాఖ (22702) ఉదయ్ ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. ప్రయాణికులు సహకరించాలని కోరారు.