స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఉద్యమంఆదివారం నాటికీ 900 రోజులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో పలు కార్యక్రమాలకు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సన్నాహాలు చేస్తోంది. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామని 2021 జనవరి 27న కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో అదే ఏడాది ఫిబ్రవరి మూడు నుంచి ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు, తదితర రూపాల్లో ఉద్యోగులు, కార్మికులు ఆందోళనలను చేపడుతున్నారు.