ట్రెండింగ్
Epaper    English    தமிழ்

14 ఏళ్ల బాలుడు దారుణ హత్య

national |  Suryaa Desk  | Published : Tue, Aug 01, 2023, 10:27 AM

ఒడిశాలో 14 ఏళ్ల బాలుడిని దారుణంగా హతమార్చారు. ఈ ఘటన అనుగల్ జిల్లాలో చోటు చేసుకుంది. సుబర్ణాపూర్‌ గ్రామానికి చెందిన సంచిత్‌ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పూజలు నిర్వహిస్తే ఆరోగ్యం బాగుపడుతుందని మంగళకోఠి అనే ఆలయానికి బాలుడి తల్లి తీసుకెళ్లింది. సంచిత్ కనిపించకుండా పోవడంతో బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలుడి మృతదేహాన్ని స్థానికంగా అటవీ ప్రాంతంలో గుర్తించారు. బాలుడిని అతి దారుణంగా హింసించి చంపారు. కాళ్లు, చేతులు నరికేసి కళ్లు తొలగించారు. ఈ మేరకు రీతాంజలితోపాటు ఆమె ముగ్గురు కుమారులను అదుపులోకి తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com