ఒంటిమిట్ట మండల పరిధిలోని నరవకాటుపల్లి అరుంధతి వాడ ప్రాథమిక పాఠశాలలను ఒంటిమిట్ట మండలము అదనపు విద్యాశాఖ అధికారి డి ప్రభాకర్ మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆయన పాఠశాలలోని రికార్డులను తనిఖీ చేశారు. ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా విద్యార్థులకు పంపిణీ చేసిన జగనన్న విద్యా కానుకలను పరిశీలించారు. ప్రభుత్వము పాఠశాలల్లో మంగళవారం నుండి నిర్వహిస్తున్న ఎఫ్ఏ 1పరీక్షలను పరిశీలించారు.