టీడీపీ అధికారంలోకి వస్తే మద్యం ధరలను తగ్గిస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడుతూ మందుబాబులకు ఈ శుభవార్తవినిపించారు. నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాసిరకం మద్యాన్ని విక్రయిస్తున్నారని విమర్శించారు. బూమ్ బూమ్, స్పెషల్ స్టేటస్, బ్రిటీష్ ఎంపైర్, బ్లాక్ బస్టర్ వంటి విచిత్రమైన బ్రాండ్లను అమ్ముతున్నారని దుయ్యబట్టారు. ఈ నాసి రకం మద్యాన్ని తాగి ఎంతో మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో 6 నెలలు ఆగితే మీ బతుకులను బాగు చేస్తానని చెప్పారు.