రాజ్యాంగం ఆర్డర్ సవరణ బిల్లు 2023ను లోక్‌సభ మంగళవారం ఆమోదించింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల జాబితాను సవరించడానికి రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్, 1950ని సవరించడానికి కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ జూలై 24న రాజ్యాంగ ఆర్డర్ (సవరణ) బిల్లు, 2023ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఢిల్లీలో సేవల నియంత్రణ ఆర్డినెన్స్ స్థానంలో మరో బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు, 2023ని ప్రవేశపెట్టారు. ఢిల్లీలో సేవల నియంత్రణ కోసం కేంద్రం మే 19న ఆర్డినెన్స్‌ను విడుదల చేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన కొద్ది రోజులకే ఆర్డినెన్స్‌ను విడుదల చేశారు.