మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేయొద్దంటూ పోలీసులు ఎంతగా అవగాహన కల్పించినా కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇతరులకు హాని చేస్తున్నారు. తాజాగా విశాఖపట్నంలోని వీఐపీ రోడ్డులో ఓ ఇన్నోవా కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అతివేగంగా మహిళ డ్రైవ్ చేయడంతో అదుపు తప్పి 8 వాహనాలను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలు బైక్ లు ధ్వంసం అయ్యాయి. కారు డ్రైవ్ చేసిన మహిళ ప్రమాదం జరగగానే కారు వదిలి పారిపోయింది.