దొంగ వికలాంగుల సర్టిఫికేట్ తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని, నిజమైన వికలాంగులకు న్యాయం జరగాలని, నిజమైన వికలాంగులకు రూ. 5 వేలు ఇవ్వాలని ఎంపీ రఘురామ కృష్ణం రాజు డిమాండ్ చేశారు. పురంధేశ్వరి దెబ్బకు వైసీపీ నేతలు అల్లాడిపోతున్నారని, రూ. 10 లక్షల 77 వేల కోట్ల అప్పు ఏపీ ప్రభుత్వం చేసిందని నిన్న పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ చెప్పారన్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రాడ్ చేసిందా? లేక ఆర్థిక శాఖ తప్పు చెప్పిందా?.. దొంగ లెక్కలపై ఒక్కరూ చర్చకు రావడం లేదని అన్నారు. పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందో మంత్రి అంబటి చెప్పడంలేదన్నారు.