సీఎం జగన్ పై విశాఖలో జరిగిన హత్యాప్రయత్నంకి సంభందించిన కోడికత్తి కేసు విశాఖకు బదిలీ అవుతున్న నేపథ్యంలో విచారణ మళ్లీ మొదటికి వచ్చినట్టేనని పలువురు భావిస్తున్నారు. అయితే, ప్రస్తుతం విచారణ ఎంతవరకు సాగిందో, ఆ తర్వాత నుంచి కొత్త కోర్టులో సాగుతుందని మరికొందరు చెబుతున్నారు. జగన్ ఈ మధ్య కాలంలో కేసులో లోతుగా దర్యాప్తు చేయాలని, కుట్ర కోణాన్ని బయటకు తీయాలని రెండు పిటిషన్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎలాంటి కుట్ర కోణం లేదని, లోలైన దర్యాప్తు అవసరం లేదని ఎన్ఐఏ కోర్టు కొద్దిరోజుల క్రితం తీర్పును ఇచ్చింది. కాగా, నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుకు విజయవాడ ఎన్ఐఏ కోర్టులో ఈనెల ఎనిమిదో తేదీన జరిగే విచారణ చివరిది కానుంది.